News March 17, 2024

కాకినాడ: 3 సార్లు ఓటమి.. ఇప్పడు YCP నుంచి గెలిచేనా..? 

image

కాకినాడ ఎంపీ వైసీపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ పోటీ చేయనున్నారు. ఈయన విదేశాల్లో చదివిన ఈయన పారిశ్రామికవేత్త. 2009 (ప్రజారాజ్యం), 2014 (వైసీపీ), 2019 (టీడీపీ) నుంచి కాకినాడ లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మళ్లీ వైసీపీలో చేరారు. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మరి ఆయన విజయం సాధించేనా..?- మీ కామెంట్..?

Similar News

News February 19, 2026

గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

image

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 19, 2026

కొవ్వూరు మున్సిపాలిటీపై పసుపు జెండా

image

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ పీఠం TDP పరమైంది. YCP మున్సిపల్ ఛైర్‌పర్సన్ బావన రత్నకుమారితో పాటు నలుగురు కౌన్సిలర్లు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బుధవారం TDPలో చేరారు. దీంతో ఎమ్మెల్యేతో కలిపి కూటమి బలం 14కు చేరి స్పష్టమైన మెజారిటీ లభించింది. గత ఎన్నికల్లో YCP గెలిచినప్పటికీ, తాజా మార్పులతో కొవ్వూరు మున్సిపాలిటీని TDP కైవసం చేసుకుంది.

News February 19, 2026

తూ.గో: భూ రికార్డుల సవరణ ఇక ఈజీ!

image

రెవెన్యూ రికార్డులైన వెబ్‌ల్యాండ్, ఆడంగల్‌లో మార్పులు చేసే అధికారాలను RDOలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని RDO కృష్ణనాయక్ తెలిపారు. మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఇకపై డివిజన్ స్థాయిలోనే పూర్తవుతుందన్నారు. దీనివల్ల పౌరసేవలు వేగవంతమై ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని వివరించారు. భూసమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు.