News August 31, 2025
సభకు కాళేశ్వరం నివేదిక.. సర్వత్రా ఉత్కంఠ

తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో తొలిసారి చర్చ జరగనుంది. ఇవాళ కాళేశ్వరంపై PC ఘోష్ రిపోర్ట్ సభలో బహిర్గతం కానుంది. కాళేశ్వరం అంతా తప్పేనని, డిజైన్ నుంచి పూర్తి నిర్మాణం వరకు KCR చెప్పినట్టే జరిగిందని GOVT విమర్శిస్తుంటే.. ఇంత గొప్ప ప్రాజెక్టే లేదని, దేశానికే రోల్ మోడల్ అని BRS వాదిస్తూ వచ్చింది. ఇవాళ సభకు <<17561158>>నివేదిక<<>> రానుండటంతో అందులో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Similar News
News September 1, 2025
స్టార్ హీరో చిన్ననాటి ఫొటో.. ఎవరో చెప్పుకోండి?

స్టార్ నటీనటుల చిన్ననాటి ఫొటోలు అప్పుడప్పుడూ SMలో కనిపిస్తుండటం చూస్తుంటాం. అలాంటి ఓ స్టార్ హీరో చైల్డ్‌హుడ్ ఫొటో తాజాగా వైరలవుతోంది. బాల నటుడిగా మొదలైన ఈయన సినీ జీవితం ఇప్పటికి 50 ఏళ్లు పూర్తయింది. తండ్రి సినీ వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ 65ఏళ్ల వయసులోనూ యంగ్ స్టార్ హీరోలకు పోటీగా బ్లాక్‌బస్టర్లు అందుకుంటున్నారు. సినిమాల్లో చేస్తూ ప్రజలకు సేవ చేస్తోన్న ఈ నటుడు ఎవరో కామెంట్ చేయండి.
News September 1, 2025
13,217 ఉద్యోగాలకు నోటిఫికేషన్

IBPS RRB XIV-2025 నోటిఫికేషన్ వెలువడింది. దేశవ్యాప్తంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ల పోస్టులున్నాయి. ఇవాళ్టి నుంచి SEP 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాలను బట్టి డిగ్రీ, LLB, డిప్లొమా, CA, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాష్ట్రాలు, బ్యాంకుల వారీగా ఖాళీలు, ఇతర వివరాల కోసం <
News September 1, 2025
బంధాలపై ఫబ్బింగ్ ప్రభావం

ప్రస్తుతం మొబైల్ వాడకం బాగా పెరిగిపోయి చాలామంది జీవితాల్లో శత్రువుగా మారింది. ఎదుటివ్యక్తితో నేరుగా మాట్లాడకుండా ఫోన్‌పై దృష్టి పెట్టి, వారిని విస్మరించడాన్ని ఫబ్బింగ్ అంటారు. ఇది బంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఫబ్బింగ్ ఎక్కువైతే భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఫోన్‌ని పక్కనపెట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడాలంటున్నారు నిపుణులు.