News November 14, 2024
DEC 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం DEC 31 వరకు పొడిగించింది. ఆలోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను విచారించింది. ఈ నెలలో ఐఏఎస్‌లను, ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉంది.
Similar News
News February 11, 2026
ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.
News February 11, 2026
‘మైసూర్ సోప్’ అంబాసిడర్‌గా తమన్నానే ఎందుకు?

తమన్నాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో <<19102536>>దుమారం<<>> రేగిన విషయం తెలిసిందే. అయితే నార్త్, సౌత్‌లో పాపులర్ ఫ్యాక్టర్, ప్రస్తుతం ఆమె ఎలాంటి బ్యూటీ సబ్బులను ప్రమోట్ చేయకపోవడం, SM ఫాలోవర్లు, పాన్ ఇండియా అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంశాలు కారణాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ చెబుతోంది. దీపిక, రష్మిక, కియారా, పూజా హెగ్డేను వెనక్కి నెట్టి తమన్నా ఈ ఆఫర్ కొట్టేశారు.
News February 11, 2026
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఎంతంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఓవరాల్‌గా 73.01శాతం పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో 66.05శాతం, మున్సిపాలిటీల్లో 75.88శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగిసినా క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించి తాజాగా పూర్తి డేటాను వెల్లడించారు. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది.


