News January 20, 2025

జూన్ నుంచి ‘కల్కి-2’ షూటింగ్: అశ్వనీ దత్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ‘కల్కి-2’ సినిమాపై నిర్మాత అశ్వనీ దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ప్రభాస్ కోసం వెయిట్ చేశాను. కాల్ షీట్స్ ఇవ్వడంతో కల్కి తీశాను. జూన్ నెల నుంచి కల్కి-2 సినిమా షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఒకేసారి ఫౌజీ, కల్కి-2, స్పిరిట్ సినిమాలు చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి.

Similar News

News November 25, 2025

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

గువాహటిలోని <>కాటన్ యూనివర్సిటీ<<>> 3 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, ఎంబీఏ, MCA, PGDCA/DCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.cottonuniversity.ac.in

News November 25, 2025

టీమ్ ఇండియాకు షాక్.. 2 వికెట్లు డౌన్

image

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 549 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 21 రన్స్‌కే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ 13, కేఎల్ రాహుల్ 6 పరుగులకే ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో సాయి సుదర్శన్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. జాన్సెన్, హార్మర్ తలో వికెట్ తీశారు. భారత్ విజయానికి మరో 527 రన్స్ కావాలి.

News November 25, 2025

BJP నన్ను రాజకీయంగా ఓడించలేదు: మమత

image

బీజేపీ రాజకీయంగా పోరాడి తనను ఓడించలేదని బెంగాల్ CM మమతా బెనర్జీ అన్నారు. ఈసీ నిష్పాక్షిక సంస్థ కాదని, ‘BJP కమిషన్‌’గా మారిపోయిందని ఆరోపించారు. బొంగావ్‌లో యాంటీ SIR ర్యాలీలో ఆమె మాట్లాడారు. బిహార్‌లో NDA ఆటను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని చెప్పారు. ఇంత తొందరగా SIR నిర్వహించాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఓట్ల జాబితా నిజమైనది కాకపోతే, 2024లో బీజేపీ గెలుపు కూడా నిజమైనది కాదని ఆరోపించారు.