News June 20, 2024
రేపు కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్

నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898AD రిలీజ్ ట్రైలర్ను రేపు సా.6 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన తొలి ట్రైలర్ మూవీపై అంచనాలను పెంచింది. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ తదితరులు నటించిన ఈ మూవీ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News November 17, 2025
పెళ్లిపై రూమర్స్.. అసహ్యమేస్తోందన్న త్రిష

తనకు పెళ్లంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మ్యారేజ్, పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ‘నేనెవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా? నాకు ఎంత మందితో వివాహం చేస్తారు? ఇలాంటి ప్రచారం ఆపండి’ అని పేర్కొన్నారు. త్రిష ఓ హీరోతో డేట్లో ఉందని, చండీగఢ్ బిజినెస్మ్యాన్ను పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.
News November 17, 2025
కిచెన్ టిప్స్

* కొత్తిమీర వాడిపోతే వేర్లు కట్ చేసి ఉప్పు కలిపిన నీటిలో కాడలు మునిగేలా ఉంచాలి. అరగంట తర్వాత కొత్తిమీర తాజాగా మారుతుంది.
* ఎంత నీరు తాగినా దాహం తీరకపోతే ఒక యాలక్కాయ నోట్లో వేసుకొని నమలి నీళ్లు తాగాలి. * గసగసాలు రుబ్బేముందు 10 నిమిషాలు వేడినీటిలో నానబెట్టి మిక్సీ పడితే మెత్తగా అవుతాయి. * ఉప్పు చెమ్మ చేరి నీరు కారిపోకుండా ఉండాలంటే.. ఉప్పు ఉన్న జాడీలో రెండు పచ్చిమిరపకాయలు వేయాలి.
News November 17, 2025
వారానికి 72 గంటల పనితోనే దేశాభివృద్ధి: మూర్తి

వారానికి 72గంటలు పనిచేయాలన్న గత వ్యాఖ్యలను ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి మరోసారి సమర్థించుకున్నారు. రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ అందుకోగలదు. కానీ దీనికోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలి. చైనాలో వారానికి 72 గంటల (9AM-9PM-6 రోజులు) రూల్ ఉంది. దేశ పని సంస్కృతిలో మార్పు అవసరమని చెప్పడానికి చైనా పని నియమమే ఉదాహరణ’ అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.


