News July 18, 2024
‘కల్కి’.. ALL TIME RECORD

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ టికెట్ బుకింగ్స్‌లో రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో ఇప్పటివరకూ 12.15+ మిలియన్ల టికెట్ సేల్స్ జరిగినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపాయి. షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’(12.01M)పై ఉన్న రికార్డును 20 రోజుల్లోనే బ్రేక్ చేయడం విశేషం. ‘కల్కి’ సెప్టెంబర్‌లో OTTలోకి వచ్చే అవకాశం ఉంది.
Similar News
News January 5, 2026
పోలవరం-నల్లమల సాగర్.. విచారణ వాయిదా

SCలో పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణ ఈనెల 12కు వాయిదా పడింది. కేటాయింపులకు విరుద్ధంగా AP నీళ్లను వాడుకుంటోందని TG వాదించింది. అయితే ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం అనుమతి తీసుకున్నామని AP తెలిపింది. TG గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందని వాదించింది. పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని SC వ్యాఖ్యానించింది.
News January 5, 2026
మలయాళ నటుడు కన్నన్ మృతి

మలయాళ నటుడు కన్నన్ పట్టాంబి(62) కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి కేరళ కోజికోడ్‌లో మరణించారు. మోహన్‌లాల్ పులి మురుగన్(మన్యం పులి), కర్మయోధతో పాటు కాందహార్, ఓడియన్, కురుక్షేత్ర తదితర చిత్రాల్లో ఆయన నటించారు. కన్నన్ సోదరుడు మేజర్ రవి కూడా ఫిల్మ్ డైరెక్టర్. రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా రవి దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన ‘మిషన్ 90 డేస్’ మూవీలోనూ కన్నన్ కనిపించారు.
News January 5, 2026
కవిత కన్నీరు.. గులాబీ బాస్ స్పందిస్తారా?

అసెంబ్లీ సాక్షిగా కవిత కన్నీరు పెట్టుకోవడం TG రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నైతికత కోల్పోయిన BRSలో తానుండలేనని ఆమె ఏడ్చేశారు. దీంతో పార్టీ, కుటుంబంతో తనకున్న విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. మొదటి నుంచీ పార్టీలో కీలకంగా ఉంటూ బతుకమ్మతో మహిళలను ఏకం చేసి రాష్ట్ర ఉద్యమానికి ఊతం తెచ్చిన కవిత ఇప్పుడు ఒంటరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గులాబీ బాస్ KCR ఎలా స్పందిస్తారో చూడాలి.


