News July 1, 2024
‘కల్కి’ బద్దలు కొట్టిన రికార్డులివే!

భారత్‌లో ఒక వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన జవాన్(₹520CR) రికార్డును ‘కల్కి'(₹555cr+) బద్దలు కొట్టింది. అలాగే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా హను-మాన్(₹350cr) రికార్డును అధిగమించింది. 2024లో తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్స్(₹191.5cr)తో పాటు మలేషియా, కెనడా, జర్మనీలో రికార్డు కలెక్షన్స్ సాధించింది. నార్త్ USలో తొలి వీకెండ్లో $11M రాబట్టిన తొలి ఇండియన్ ఫిల్మ్‌గా నిలిచింది.
Similar News
News November 24, 2025
KNR: ‘ప్రజావాణి’ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణిలో కరీంనగర్ నగరపాలక కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 352 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
News November 24, 2025
వన్డేలకు రెడీ అవుతున్న హిట్‌మ్యాన్

ఈ నెల 30 నుంచి సౌతాఫ్రికాతో జరిగే 3 వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధం అవుతున్నారు. గత 5, 6 రోజులుగా అతడు బెంగళూరు ట్రైనింగ్ సెంటర్లో ఉన్నారు. ఫిట్నెస్ పెంచుకోవడంతో పాటు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో స్పెషల్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. మరోవైపు తాను జిమ్‌లో గడిపే ఫొటోలను రోహిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
News November 24, 2025
హేమమాలినితో హగ్స్ కోసం ధర్మేంద్ర ఏం చేశారంటే..?

‘షోలే’ మూవీ షూటింగ్లో<<18374925>>ధర్మేంద్ర<<>> ఓ కొంటె పని చేశారు. హీరోయిన్ హేమమాలినితో హగ్స్ కోసం స్పాట్ బాయ్స్‌కు లంచం ఇచ్చారు. షాట్ మధ్యలో అంతరాయం కలిగించాలని వారికి చెప్పారు. రీటేక్ తీసుకునేలా చేసినందుకు ₹20 చొప్పున ₹2 వేలు స్పాట్ బాయ్స్‌కు ఇచ్చారు. అంటే దాదాపు 100 వరకు రీటేక్స్ తీసుకున్నారు. షోలే 1975లో రిలీజ్ కాగా, వీరిద్దరూ నాటకీయ పరిణామాల మధ్య 1980లో పెళ్లి చేసుకున్నారు.


