News May 21, 2024
రెండు ఓటీటీల్లోకి ‘కల్కి’?

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ 2 OTTల్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ నెట్ఫ్లిక్స్లో, ప్రాంతీయ భాషలు అమెజాన్ ప్రైమ్లో ప్రసారమవుతాయని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ డిజిటల్ రైట్స్ రూ.200 కోట్లు, నార్త్ డిజిటల్ రైట్స్ రూ.175 కోట్లకు అమ్ముడైనట్లు టాక్. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Similar News
News January 12, 2026
Q3 ఫలితాలు ప్రకటించిన TCS.. భారీగా డివిడెండ్

టీసీఎస్ Q3 ఫలితాలను ప్రకటించింది. FY 2025-26 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి రూ.10,657 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో(Q3-రూ.12,380) పోలిస్తే 14% నికరలాభం తగ్గినట్లు తెలిపింది. అయితే ఆదాయంలో మాత్రం 5శాతం వృద్ధితో రూ.67,087 కోట్లకు చేరింది. 11,151 మంది ఉద్యోగులు తగ్గిపోగా ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో షేర్పై రూ.57 చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.
News January 12, 2026
డీఏపై జీవో విడుదల

TG: ప్రభుత్వ ఉద్యోగుల <<18837053>>డీఏ 3.64%<<>> పెంచుతూ సర్కారు జీవో విడుదల చేసింది. 2023 జులై 1 నుంచి ఇది వర్తించనుంది. పెరిగిన డీఏ జనవరి నెల వేతనంతో కలిపి ఫిబ్రవరి 1న చెల్లించనున్నారు. 2023 జులై 1 నుంచి 2025 డిసెంబర్ 31 వరకు డీఏ బకాయిలు GPF ఖాతాలో జమ చేయనున్నారు. మున్సిపాలిటీ ఉద్యోగుల నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల వరకు అందరి జీతాలు పెరగనున్నాయి.
News January 12, 2026
సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిట్ కార్డులు విడుదల

ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని <


