News June 27, 2024
‘కల్కి’: కృష్ణుడి పాత్రధారి ఇతనే?

‘కల్కి’ సినిమాలో కృష్ణుడి పాత్ర గురించి చర్చ నెలకొంది. ఆ పాత్రలో కనిపించిన వ్యక్తి ఇతడేనని పలువురు నెట్టింట పోస్టులు చేస్తున్నారు. కృష్ణ కుమార్ అలియాస్ కేకే ఆ రోల్లో కనిపించారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. KKకు సినీ రంగంలో పలు విభాగాల్లో ప్రావీణ్యం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ పాత్రకు యంగ్ నటుడు అర్జున్ దాస్ డబ్బింగ్ చెప్పారని సమాచారం.
Similar News
News October 25, 2025
ఫ్లవర్వాజ్లో పూలు తాజాగా ఉండాలంటే..

ఫ్లవర్ వాజ్లో ప్లాస్టిక్ పువ్వులకు బదులు రియల్ పువ్వులను పెడితే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఇవి త్వరగా వాడిపోతుంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే పువ్వులను ఫ్లవర్వాజ్లో పెట్టేటప్పుడు వాటి కాడలను కొంచెం కట్ చేయాలి. అలాగే ఈ నీటిని రెండు రోజులకు ఒకసారి మారుస్తుండాలి. ఇందులో కాపర్ కాయిన్/పంచదార/ వెనిగర్ వేస్తే పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి. ఫ్లవర్వాజ్ను నేరుగా ఎండ తగిలే ప్లేస్లో ఉంచకూడదు.
News October 25, 2025
బిహార్లో గెలిచేది ఎన్డీయేనే.. నేనూ ప్రచారం చేస్తా: CM చంద్రబాబు

AP: ఈ దశాబ్దం ప్రధాని మోదీదే అని CM చంద్రబాబు అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA విజయం సాధిస్తుందని, కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. ప్రజలను శక్తిమంతులను చేయాలనే లక్ష్యంతో NDA ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తోందని చెప్పారు. రాష్ట్రంలో పవర్లోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని PTIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
News October 25, 2025
పశుగ్రాస విత్తనాలు, పశుగణ బీమాకు నిధులు విడుదల

AP: పశుగణ బీమా, నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.


