News August 25, 2024

పాకిస్థాన్‌లో ‘కల్కి’ ట్రెండింగ్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. వీకెండ్ కావడంతో ‘కల్కి’ని టీవీల్లో చూసేందుకు ప్రేక్షకులు మొగ్గుచూపుతున్నారు. దీంతో నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాలో టాప్-3లో ట్రెండ్ అవుతోంది. అయితే, పాకిస్థాన్‌లోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం నంబర్1లో ట్రెండ్ అవుతుండగా ఖతర్‌లో మూడో ప్లేస్‌లో కొనసాగుతోంది.

Similar News

News March 25, 2026

రింకూకు KKR ప్రమోషన్

image

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తమ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. రహానే కెప్టెన్‌గా కొనసాగుతుండగా రింకూ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నారు. RCBకి వెళ్లిపోయిన వెంకటేష్ అయ్యర్ ప్లేస్‌ను రింకూ భర్తీ చేయబోతున్నారు. కేవలం ఫినిషర్‌గానే కాకుండా టీమ్ లీడర్‌గా రింకూను ఎదిగేలా చూడడమే ఫ్రాంచైజీ ప్లాన్.

News March 25, 2026

ఆ ఫుడ్స్ తింటే తండ్రయ్యే ఛాన్స్ తక్కువట!

image

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే పురుషుల్లో సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ వర్సిటీ స్టడీలో తేలింది. చిప్స్, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ లాంటివి అధికంగా తీసుకోవడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ టైమ్ పడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. అటు మహిళల్లో ఈ ఫుడ్ వల్ల గర్భంలో పిండం ఎదుగుదల నెమ్మదిస్తుందని ఈ సర్వే హెచ్చరించింది.

News March 25, 2026

చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

image

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.