News July 20, 2024
KALKI: ప్రభాస్, అమితాబ్‌కు లీగల్ నోటీసులు

‘కల్కి’లో కల్కి భగవానుడి గురించి గ్రంథాలకు భిన్నంగా, తప్పుగా చూపించారని అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌తో పాటు సినిమా యూనిట్‌కు కల్కి ధామ్ పీఠాధిపతి ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. తల్లి(దీపిక) కృత్రిమ గర్భధారణ ద్వారా కల్కి పుట్టబోతున్నట్లు చూపించి వందల కోట్ల హిందువుల మనోభావాలను దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. హిందూ గ్రంథాలను వాడుకోవడం ఈ మధ్య ఫ్యాషన్‌గా మారిందని ఆగ్రహించారు.
Similar News
News August 31, 2025
మైనర్లకు వాహనాలిస్తే రూ.లక్ష జరిమానా!

TG: 18 ఏళ్లు నిండకుండానే బైకులతో రోడ్లపై రయ్ రయ్ అంటూ మైనర్లు దూసుకెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో తమ పిల్లలు ప్రాణాలు కోల్పోకూడదని జనగామ(D) నాగిరెడ్డిపల్లి గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే పెరెంట్స్‌కు రూ.లక్ష జరిమానా విధించాలని తీర్మానించింది. ప్రమాదాల నివారణకు బాధ్యతతో ఈ గ్రామం తీసుకున్న నిర్ణయం అన్ని గ్రామాలకు ఆదర్శనీయం.
News August 31, 2025
శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారు: లలిత్

IPL-2008 సమయంలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన వీడియో బయట పెట్టడంపై <<17559909>>శ్రీశాంత్ భార్య<<>> ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై లలిత్ మోదీ స్పందించారు. ‘శ్రీశాంత్ భార్య ఎందుకు ఫైరవుతున్నారో నాకర్థం కాలేదు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఏం జరిగిందనే నిజాన్ని షేర్ చేశా. శ్రీశాంత్ బాధితుడు. నేను సరిగ్గా అదే చెప్పా. గతంలో నన్నెవరూ ఈ ప్రశ్న అడగలేదు. క్లార్క్ అడిగితేనే స్పందించా’ అని తెలిపారు.
News August 31, 2025
రేపు గవర్నర్‌ను కలుస్తాం: పొన్నం

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రేపు కలవనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు కోసం ప్రధాని మోదీ, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తామన్నారు. BRS సహా అన్ని పార్టీల నేతలనూ గవర్నర్ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని, సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.