News July 5, 2024
ఇండియాలో ‘కల్కి’ మేనియా.. జపాన్‌లో నేడు ‘సలార్’ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్-1’ జపాన్‌లో ఇవాళ రిలీజైంది. గతేడాది డిసెంబర్ 22న భారత్‌లో రిలీజైన ఈ సినిమా ఆరు నెలల తర్వాత జపనీయులను మెప్పించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో IMAX-జపాన్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేస్తోంది. ప్రభాస్ సినిమాలకు జపాన్‌లో ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ‘కల్కి’ చూసేందుకు జపాన్ నుంచి పలువురు HYDకు వచ్చారు.
Similar News
News October 15, 2025
UN HRC మెంబర్స్‌గా ఇండియా, పాకిస్థాన్

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ను ఎన్నుకుంది. మెంబర్స్‌గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్‌లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News October 15, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 15, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.54 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.