News June 27, 2024
కల్కి: రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన ప్రభాస్?

దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా పేరున్న ప్రభాస్ ‘కల్కి’కి ఫీజు సగానికి తగ్గించారట. సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.150కోట్లు తీసుకుంటారని, ‘కల్కి’కి రూ.80కోట్లే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు భారీగా బడ్జెట్(రూ.600కోట్లు) పెట్టాల్సి రావడమే ప్రభాస్ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. అటు అమితాబ్, కమల్ హాసన్, దీపిక తలా రూ.20కోట్లు తీసుకున్నారట.
Similar News
News April 10, 2026
‘హార్ముజ్’ వద్ద టోల్ వసూలు చేయవద్దు: ట్రంప్

‘హార్ముజ్’ వద్ద ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ స్పందించారు. ఒకవేళ ఫీజు వసూలు చేస్తుంటే వెంటనే ఆపేయాలని సూచించారు. ఇక ఇరాన్‌పై తాను ముందస్తు విజయం ప్రకటించుకున్నట్లు WSJ ప్రచురించడంపై ట్రంప్ మండిపడ్డారు. తాము విక్టరీ సాధించామని, ముందస్తు అనేదే లేదన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండకుండా చేస్తానని చెప్పారు. ఆ దేశ సాయం లేకపోయినా త్వరలోనే ఆయిల్ యథావిధిగా సరఫరా అవుతుందన్నారు.
News April 10, 2026
వరుస ఫ్లాప్స్.. కృతి శెట్టి ఏమన్నారంటే?

సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఉప్పెన’తో హీరోయిన్గా లాంచ్ అయిన కృతిశెట్టి తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంపై స్పందించారు. బేబమ్మ లాంటి బలమైన పాత్ర తనకు మళ్లీ రాలేదని, అది ఒక లోటుగా మిగిలిపోయిందని చెప్పారు. సినిమాలు ఫెయిల్ అవుతున్నాయన్న బాధ కంటే బలమైన పాత్రలు దక్కలేదనే బాధే ఎక్కువగా ఉందని ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా ప్రమోషన్లలో వెల్లడించారు. త్వరలో ఆమె అనిల్ రావిపూడి డైరెక్షన్లో నటించబోతున్నారు.
News April 10, 2026
అభిమానికి కొత్త ఫోన్ ఇచ్చిన సంజూ.. నెట్టింట ప్రశంసలు

రోడ్డుపై సెల్ఫీ అడిగిన ఫ్యాన్‌కు టీమ్ ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ స్మార్ట్ ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడంపై ప్రశంసలొస్తున్నాయి. కేరళంలోని పాలక్కాడ్ సమీపంలో కాల్ మాట్లాడేందుకు సంజూ కారును ఆపారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శబరీష్ అనే యువకుడు సంజూను చూసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ ఫోన్ డిస్ప్లే పాడయిందని గమనించిన సంజూ వెంటనే ఓ కొత్త ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.


