News June 22, 2024

రికార్డు స్థాయిలో ‘కల్కి’ ప్రీరిలీజ్ బిజినెస్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘కల్కి’ రిలీజ్‌కు ముందే భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈనెల 27న రిలీజ్ కానుండగా రూ.385 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు సినీవర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, హిందీలో రూ.85 కోట్లు, కర్ణాటకలో రూ.28 కోట్లు, తమిళనాడులో రూ.16 కోట్లు, కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.70 కోట్ల బిజినెస్ జరిగిందట. ప్రభాస్ కెరీర్‌లో ఇదే అత్యధికం.

Similar News

News October 9, 2024

నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

image

నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.

News October 9, 2024

నిలవాలంటే గెలవాల్సిందే..

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్‌కు కాస్త ప్లస్‌గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.

News October 9, 2024

విదేశీ విద్య: ఏ ఇన్‌టేక్ మంచిది..?

image

విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్‌ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్‌టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్‌ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్‌టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్‌టేక్‌ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.