News June 27, 2024

మనం వెళ్లిపోయాక కూడా కల్కి గుర్తుంటుంది: విజయ్ దేవరకొండ

image

‘కల్కి 2898ఏడీ’పై నటుడు విజయ్ దేవరకొండ ట్విటర్‌లో ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నాగీ, ప్రభాస్ అన్నా, వైజయంతీ ఫిల్మ్.. ఈ ప్రేమ, విజయానికి మీరు అర్హులు. మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యు. అమితాబ్, దీపిక, కమల్ వంటివారు లేకపోతే కల్కి ఇలా ఉండేది కాదు. మనమందరం వెళ్లిపోయాక కూడా ఈ సినిమా చాలాకాలం గుర్తుంటుంది’ అని పేర్కొన్నారు. మూవీలో విజయ్ కీలక పాత్ర పోషించడం గమనార్హం.

Similar News

News October 29, 2025

తుఫాన్ బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000

image

AP: తుఫాన్ బాధితులకు ప్రభుత్వం ఆర్థిక <<18137630>>సాయం<<>> ప్రకటించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి రూ.1000 అందజేయాలని నిర్ణయించింది. కుటుంబంలో ముగ్గురి కంటే ఎక్కువ ఉంటే గరిష్ఠంగా రూ.3000 అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లే ముందు ఈ నగదు ఇవ్వనున్నారు.

News October 29, 2025

ఎయిమ్స్ మదురైలో 84 పోస్టులు

image

<>ఎయిమ్స్ <<>>మదురై 84 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD, MS, DM, M.Ch, PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు గరిష్ఠ వయసు 58ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు గరిష్ఠ వయసు 50ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsmadurai.edu.in/

News October 29, 2025

రంగు చెప్పే ఆరోగ్య రహస్యం!

image

జీవనశైలి కారణంగా సంతానలేమి సమస్య పెరుగుతోంది. ఈక్రమంలో పురుషులు తమ ఆరోగ్య సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వీర్యం రంగును చెక్ చేసుకోవాలంటున్నారు. ఆకుపచ్చ రంగు ఇన్‌ఫెక్షన్ (STIs కూడా)కు సూచన కావొచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పసుపు రంగు యూరిన్ కలవడం లేదా సప్లిమెంట్ల ప్రభావమై ఉండొచ్చు. రెడ్ కలర్ రక్తానికి సంకేతం (వైద్య పరీక్ష అవసరం). తెలుపు/బూడిద రంగు హెల్తీ.