News July 3, 2024
‘కల్కి’: 6 రోజుల్లో రూ.680 కోట్లు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. రిలీజైన 6 రోజుల్లోనే రూ.680+ కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వీకెండ్లో రోజుకు రూ.100+ కోట్లు సాధించిన ఈ మూవీ సోమ, మంగళ వారాల్లోనూ 50+ కోట్లు కొల్లగొట్టినట్లు వెల్లడించాయి. వచ్చే వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News January 30, 2026
పాక్ T20 WC నిర్ణయంపై నేడు క్లారిటీ!

ICC T20 WC 2026లో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా అన్నదానిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. తమ అనంతరం నిర్ణయాన్ని శుక్రవారం/సోమవారం వెల్లడిస్తామని తెలిపారు. ICCతో సంబంధాలు కాపాడుకోవడం కీలకమని ప్రధానికి నఖ్వీ వివరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే పాక్ జట్టు కొలంబోకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
News January 30, 2026
ఫ్యాట్ ఫోబియా గురించి తెలుసుకోండి

చాలామంది లావుగా ఉండటం వల్ల అందంగా లేమని కుంగిపోతుంటారు. దీన్నే ఫ్యాట్ ఫోబియా అంటారు. ఈ భయం శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తుందని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధికబరువు వల్ల ఎందులోనూ సక్సెస్ కాలేమని, తెలివితేటల్లోనూ తక్కువేనని బాధపడతారు. ఫొటోలు, అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడరు. ఇలా కాకుండా తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకుంటేనే దీన్నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.
News January 30, 2026
నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా తగ్గి 82,150 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకు పైగా నష్టపోయి 25,270 వద్ద కొనసాగుతోంది. HDFC, SBI, ITC, నెస్లే ఇండియా, డా.రెడ్డీస్ వంటి కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.


