News September 27, 2024
అంతర్జాతీయ వేదికపై ‘కల్కి’ స్క్రీనింగ్

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ సినిమాను ప్రతిష్ఠాత్మక బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని ‘కల్కి’ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 8&9 తేదీల్లో దక్షిణ కొరియాలోని బుసాన్‌లో జరిగే ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ జరుగుతుందని వెల్లడించింది. కాగా, జూన్ 27న థియేటర్లలో రిలీజైన ‘కల్కి’ రూ.1000+ కోట్లు కలెక్ట్ చేసింది.
Similar News
News October 23, 2025
కోహ్లీ గెస్చర్ దేనికి సంకేతం?

AUSతో రెండో వన్డేలో డకౌటై వెళ్తూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన ఫ్యాన్స్‌కు కోహ్లీ చేతిని పైకి చూపిస్తూ థాంక్స్ చెప్పారు. అయితే దీనిపై SMలో చర్చ జరుగుతోంది. రన్ మెషీన్ అడిలైడ్‌లో చివరి మ్యాచ్ ఆడేశారని, అందుకే ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అటు సిరీస్ తర్వాత రిటైర్ కానున్నారని, అదే హింట్ ఇచ్చారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తొలి వన్డేలోనూ కోహ్లీ ‘0’కే ఔటయ్యారు.
News October 23, 2025
ఆర్టీసీలో ఇకపై అన్నీ విద్యుత్తు వాహనాలే

AP: RTCలో ప్రస్తుత బస్సుల స్థానంలో విద్యుత్ వాహనాలు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై CM CBN APSRTCకి ఆదేశాలిచ్చారు. ప్రతి 30 KMకి 1 ఛార్జింగ్ స్టేషన్, ఈ-మొబిలిటీ స్టార్టప్‌ల ప్రోత్సాహానికి 100 ఇన్క్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పుతారు. E-VEHICLE ప్రాజెక్టు కోసం ₹500 CR ఇవ్వనున్నారు. కేంద్ర ‘PM E-DRIVE’ స్కీమ్ కింద ఉన్న ₹10,900 కోట్ల ఫండ్‌ను అందిపుచ్చుకొనేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
News October 23, 2025
బాలింతలు ఏం తినాలంటే?

ఒక మహిళ జీవితంలో ఎక్కువ కెలోరీలు అవసరమయ్యేది బాలింత దశలోనే. బిడ్డకు పాలివ్వడం వల్ల ఆకలి ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సమయంలో సమతులాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్యలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్ తీసుకోవాలి. మిల్లెట్స్ జావలు, సూప్స్, చికెన్, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వులు, చక్కెర, ఉప్పులున్న ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి.