News June 28, 2024
‘కల్కి’.. విజువల్ వండర్: మంత్రి కోమటిరెడ్డి

TG: ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ కుటుంబసమేతంగా చూసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ నాగ్అశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. లెజెండరీ నటులు అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన మూవీ విజువల్ వండర్ అని ట్వీట్ చేశారు. సినిమాలు విజయవంతం అయితేనే లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, ప్రతిఒక్కరూ ఈ మూవీ చూడాలని కోరారు.
Similar News
News January 25, 2026
TNలో హిందీకి స్థానం లేదు: CM స్టాలిన్

రాష్ట్రంలో హిందీ భాషకు ఎప్పుడూ స్థానం లేదని, ఫ్యూచర్లోనూ ఉండబోదని TN CM స్టాలిన్ చెప్పారు. తమిళ భాషను ప్రజలంతా ప్రేమిస్తారని దానిని మరుగుపరిచే చర్యలను ఉపేక్షించబోమన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతిసారీ తమిళులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. 1965లో TNలో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగా నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఈ కామెంట్స్ చేశారు.
News January 25, 2026
H-1B షాక్.. ఇంటర్వ్యూలు 2027కి వాయిదా

అమెరికా H-1B వీసా దరఖాస్తుదారులకు భారీ షాక్ తగిలింది. ఇండియాలోని US కాన్సులేట్లలో బ్యాక్లాగ్స్ పెరగడంతో వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్లు 2027కి వాయిదా పడ్డాయి. హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో స్లాట్లు లేకపోవడంతో ఇప్పటికే ఇండియా వచ్చిన వారు ఇక్కడే చిక్కుకుపోయారు. ఇతర దేశాల్లో స్టాంపింగ్ చేసుకునే ఛాన్స్ కూడా లేకపోవడంతో ఉద్యోగాలు, కుటుంబాల విషయంలో ఆందోళన నెలకొంది.
News January 25, 2026
తగ్గనున్న BMW, ఫ్రెంచ్ వైన్ ధరలు?

భారత్-EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27న జరిగే India-EU సమ్మిట్లో ఒప్పందం ఖరారు లాంఛనంగా కనిపిస్తోంది. అదే జరిగితే BMW, ఫోక్స్వ్యాగన్ వంటి ప్రీమియం కార్లు, ఫ్రెంచ్ వైన్ సహా అనేక ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే ఇండియా నుంచి టెక్స్టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో EU మార్కెట్ భారత్కు కీలకం కానుంది.


