News June 11, 2024
అక్కడ ఒక రోజు ముందే ‘కల్కి’ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ లండన్‌లో ఒక రోజు ముందుగానే రిలీజ్ కానుంది. అక్కడి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐమ్యాక్స్‌లో ప్రీమియర్ వేయనున్నారు. గతంలో ఇక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఒక రోజు ముందే విడుదలైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
Similar News
News October 27, 2025
ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్: రహానే

టీమ్ ఇండియా సెలక్టర్లపై రహానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఆటలో ఏజ్ కాదు.. ఇంటెంట్ మ్యాటర్. అనుభవమున్న, డొమెస్టిక్ క్రికెట్లో రాణిస్తున్న నా లాంటి ప్లేయర్లను సెలక్టర్లు కన్సిడర్ చేయాలి. కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఎక్కువ ఛాన్సులివ్వాలి. కానీ వారి నుంచి సరైన కమ్యునికేషన్ లేదు. సెలెక్ట్ చేసినా చేయకపోయినా గేమ్‌ను ఆస్వాదిస్తా. BGT 2024-25లో టీమ్‌కు నా అనుభవం పనికొచ్చేది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
News October 27, 2025
అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం
News October 27, 2025
కరూర్ తొక్కిసలాటపై CBI దర్యాప్తు ప్రారంభం

TN కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తును CBI అధికారంగా చేపట్టింది. FIRను రీ-రిజిస్టర్ చేసింది. ఇందులో TVK జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ సహా పలువురు పేర్లున్నాయని, త్వరలో అరెస్టులు జరగొచ్చని సమాచారం. ఈ కేసును తొలుత SIT దర్యాప్తు చేయగా, CBIకి ఇవ్వాలని TVK సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం కేసు దర్యాప్తును ధర్మాసనం CBIకి అప్పగించింది. కాగా బాధిత కుటుంబాలను విజయ్ ఇవాళ <<18105218>>పరామర్శించనున్నారు<<>>.


