News July 22, 2024
RRR రికార్డును బ్రేక్ చేసిన ‘కల్కి2898AD’

ప్రభాస్ ‘కల్కి2898AD’ మూవీ విడుదలై 4 వారాలవుతున్నా బాక్సాఫీసు వద్ద కాసులవర్షం కురిపిస్తోంది. తాజాగా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో దక్షిణాది సినిమాగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు RRR పేరిట ఉన్న రికార్డును కల్కి బ్రేక్ చేసింది. హిందీలో RRR రూ.272.78 కోట్లు వసూలు చేయగా, 4 వారాల్లోనే కల్కి రూ.275.9 కోట్లు సాధించింది. బాహుబలి-2 రూ.511 కోట్లు, KGF-2 రూ.435 కోట్లతో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News December 5, 2025
గూగుల్ డేటా సెంటర్కు 480 ఎకరాలు

AP: విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్కు 480 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. విశాఖ(D)లోని తర్లువాడ, అడవివరం, అనకాపల్లి(D)లోని రాంబిల్లిలో భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. గూగుల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న అదానీ ఇన్ఫ్రా పేరున కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశల వారీగా వెయ్యి మెగా వాట్ల ఏఐ డేటా సెంటర్ను గూగుల్ ఏర్పాటు చేయనుంది.
News December 5, 2025
ఉప్పుతో ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే..?

ఉప్పుతో పెట్టే దీపాన్నే ఐశ్వర్య దీపం అంటారు. శుక్రవారం ఈ దీపాన్ని వెలిగిస్తే సిరిసంపదలకు లోటుండదని నమ్మకం. ఇలా 11, 21 వారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయని పండితులు సూచిస్తున్నారు. ‘ఉప్పులో దృష్టి దోషాలను పోగొట్టే శక్తి ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలకు ఎలాంటి దోషం కలగకూడదంటే ఈ దీపం వెలిగించాలి’ అని చెబుతున్నారు. ఉప్పు దీపం ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News December 5, 2025
కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సెల్ఫ్ స్లాట్కు అవకాశం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<


