News July 11, 2024
కల్కి@రూ.1,000 కోట్లు.. చరిత్ర సృష్టించిన ప్రభాస్

ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా ₹వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండు సినిమాలకు(బాహుబలి-2, కల్కి) ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటుడిగా డార్లింగ్ చరిత్ర సృష్టించారు. ఓవరాల్ కలెక్షన్ల జాబితాలో ఏడో స్థానానికి మూవీ చేరింది. తొలి 6 ప్లేస్‌లలో దంగల్(₹2,024Cr), బాహుబలి-2(₹1,810Cr), RRR(₹1,387Cr), KGF-2(₹1,250Cr), జవాన్(₹1,148Cr), పఠాన్(₹1,050Cr) ఉన్నాయి.
Similar News
News September 15, 2025
బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా

TG: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో రూ.10 కోట్ల దావా పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని గతంలో బండికి కేటీఆర్ నోటీసులు పంపారు. అయితే సంజయ్ వాటిపై స్పందించలేదు. దీంతో కేటీఆర్ చట్టపరమైన చర్యలకు దిగారు.
News September 15, 2025
వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలి: సీఎం రేవంత్

TG: రాష్ట్రమంతటా LED వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలన్నారు. అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్ఈడీ లైట్లున్నాయని, అవి పని చేయటంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. అన్ని లైట్లను HYDలోని కమాండ్ కంట్రోల్ సెంటరుతో అనుసంధానం చేయాలని ఆదేశించారు.
News September 15, 2025
యునెస్కో జాబితాలోకి మరో 7 ఇండియన్ సైట్స్

భారత్‌లోని మరో 7 ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక వారసత్వ జాబితాలో చేర్చింది.
* పంచగని&మహాబలేశ్వర్(MH) వద్ద ఉన్న దక్కన్ ట్రాప్స్
* ఉడుపి(KN)లోని సెయింట్ మేరీస్ ఐలాండ్ క్లస్టర్ భౌగోళిక వారసత్వం
* మేఘాలయన్ ఏజ్ కేవ్స్(తూర్పు ఖాసీ కొండలు, మేఘాలయ)
* కిఫిర్(నాగాలాండ్)లోని నాగా హిల్ ఓఫియోలైట్
* వైజాగ్(AP)లోని ఎర్ర మట్టి దిబ్బల సహజ వారసత్వం
* తిరుపతి(AP)లోని తిరుమల కొండలు
* వర్కల(కేరళ) సహజ వారసత్వం