News June 19, 2024

ఇవాళ్టి నుంచి ‘పవర్’ కళ్యాణ్

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ CMగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉ.9.30 క్యాంప్ ఆఫీసులో వేదపండితుల ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపడతారు. ఉ.11.30కి IAS, IPS అధికారులతో, మ.12 గంటలకు గ్రూప్-1,2 అధికారులతో, ఆ తర్వాత పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అనంతరం మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు జనసేనాని వెళ్లనున్నారు. తన రాజకీయ జీవితంలో తొలిసారి మంత్రి అవుతున్న పవన్‌కు ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Similar News

News January 18, 2025

చలికాలంలో అల్లం.. ఆరోగ్యానికి వరం

image

చలికాలంలో అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కోసం అల్లంతో టీ, సూప్, కషాయం చేసుకుని తాగాలి. దీని వల్ల శరీరం వేడిగా ఉంటుంది. గ్యాస్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి అల్లం మంచి ఔషధంగా పని చేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

News January 18, 2025

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. స్టేటస్‌లకు మ్యూజిక్!

image

వాట్సాప్‌లో స్టేటస్‌లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ వచ్చింది. ఫొటోలకు 15 సెకన్లు, వీడియోలకు వాటి నిడివిని బట్టి మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన ఆడియో కోసం సెర్చ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్ ఇప్పటికే ఉన్న సంగతి తెలిసిందే.

News January 18, 2025

నేటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం

image

AP: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది.