News October 7, 2025

MP సీటుతో కమల్ అమ్ముడుపోయారు: అన్నామలై

image

కరూర్ తొక్కిసలాటపై TNలో రాజకీయ చిచ్చు రాజుకుంది. ప్రభుత్వాన్ని పొగిడిన కమల్ హాసన్‌పై బీజేపీ నేత అన్నామలై విరుచుకుపడ్డారు. MP సీటుతో DMKకి అమ్ముడుపోయారని విమర్శించారు. ఆయన్ను తమిళ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. కాగా ఇటీవల బాధితుల్ని పరామర్శించిన NDA ఎంపీలు ప్రభుత్వ వైఫల్యమే కారణమని తప్పుబట్టారు. కరూర్ ఘటనను BJP రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని CM స్టాలిన్ దానికి కౌంటరిచ్చారు.

Similar News

News March 20, 2026

HYD: 2BHK ఇళ్ల రద్దుకు నిర్ణయం!

image

డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు షాకింగ్ న్యూస్. పట్టాలు తీసుకొని ఇళ్లలో ఉండకపోతే ఆ ఇళ్లను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇటీవల తూంకుంటలో అధికారులు తనిఖీలు చేశారు. లబ్ధిదారులు లేని ఫ్లాట్‌లకు నోటీసులు అంటించారు. స్వాధీనం చేసుకొన్న ఇళ్లను L2 జాబితాలోని అర్హులకు ఇవ్వనున్నారు. మౌలిక వసతుల కొరత, సిటీ శివారులో ఇళ్లు ఉండడంతో కొందరు ఇక్కడ ఉండేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

News March 20, 2026

అకాల వర్షాలు.. పంట నష్టంపై రైతుకు భరోసా!

image

AP: అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట నష్టాల వివరాలను ఎప్పటికప్పుడు సమర్పించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, NTR, అనంతపురం, మన్యం జిల్లాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు CM దృష్టికి తెచ్చారు. వాతావరణ పరిస్థితులపై రైతులను అప్రమత్తం చేయాలని CBN సూచించారు. మరోవైపు పంట నష్టపోయిన ప్రతి రైతుకూ సాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్న భరోసా ఇచ్చారు.

News March 20, 2026

గల్ఫ్‌కు US ₹1.5 లక్షల కోట్ల ఆయుధాలు

image

UAE, కువైట్‌కు దాదాపు ₹1.5 లక్షల కోట్ల మిలిటరీ సేల్స్‌కు US ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మిస్సైల్, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ రాడార్లు, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్‌, మిస్సైల్స్, F-16 యుద్ధ విమానం కోసం వివిధ రకాల ఆయుధాలను అమ్మనుంది. US, ఇజ్రాయెల్‌పై ప్రతీకారంతో ఇరాన్ ఈ 2 దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో కొన్ని ఆయిల్, గ్యాస్‌ ఫీల్డ్‌లూ లక్ష్యంగా మారుతున్నాయి.