News October 14, 2024

గాజా పరిస్థితులపై కమలా హారిస్ ట్వీట్

image

యుద్ధవాతావరణంతో గాజాలోని ప్రజలు ఆహారం అందక ఇబ్బందులు పడుతున్నారని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. ‘దాదాపు 2 వారాలుగా ఉత్తర గాజాలోకి ఎలాంటి ఆహారం వెళ్లలేదని UN నివేదించింది. అవసరమైన వారికి ఆహారం అందించేలా ఇజ్రాయెల్ అత్యవసరంగా యుద్ధాన్ని నిలిపివేయాలి. పౌరులను రక్షించాలి. ఆహారం, నీరు, మెడిసిన్స్ వారికి అందించాలి. మానవతా చట్టాన్ని గౌరవించండి’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 14, 2024

అలాంటి నాయకులను నమ్మొద్దు: అశోక్‌గజపతి రాజు

image

AP: గత ఐదేళ్లలో ఆలయాలను భ్రష్టు పట్టించారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు మండిపడ్డారు. APలోని అన్ని ఆలయాల్లో ప్రసాదం కల్తీ చేశారని ఆరోపించారు. రామతీర్థ విగ్రహాన్ని ధ్వంసం చేసి విధ్వంస పాలన చేశారని దుయ్యబట్టారు. నాడు విగ్రహం కోసం నిధులు సేకరించి పంపిస్తే వెనక్కి పంపారన్నారు. ఇంట్లో ఒక మతం, బయట మరో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దని, తమ ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సవ్యంగా సాగుతోందన్నారు.

News October 14, 2024

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

News October 14, 2024

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: జగ్గారెడ్డి

image

TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ MLA జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మలారెడ్డి లేదా తన అనుచరుడు ఆంజనేయులతో పోటీ చేయిస్తానని తెలిపారు. ‘దీనిపై CM రేవంత్, మహేశ్ కుమార్ గౌడ్‌తో చర్చిస్తా. గత ఎన్నికల్లో BRS నేతలు ఓటుకు రూ.2వేలు ఇచ్చి నన్ను ఓడించారు. ఓడినా ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధికి నిధులు తెస్తా’ అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.