News July 8, 2024

కమలా హారిస్ భర్తకు కొవిడ్ పాజిటివ్

image

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌగ్ ఎమ్‌హాఫ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయన కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని పేర్కొంది. ‘డౌగ్‌కు ఇప్పటికే 3సార్లు వాక్సినేషన్, 3సార్లు బూస్టర్ డోసు పూర్తయ్యాయి. ఇంటిదగ్గర నుంచే ఐసొలేషన్‌లో ఉంటూ ఆయన పనిచేసుకుంటున్నారు. ఇక కమలా హారిస్‌కు నిర్వహించిన టెస్టుల్లో నెగటివ్‌గా తేలింది’ అని వెల్లడించింది.

Similar News

News January 29, 2026

రాజకీయాల్లోకి సింగర్ అర్జిత్ సింగ్?

image

రిటైర్‌మెంట్‌ ప్రకటించి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ కొత్త జర్నీ ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు సాగిన ప్రయాణానికి పూర్తి భిన్నమైన రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. WBకు చెందిన ఆయన కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు సన్నిహిత వర్గాలను పేర్కొంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయబోరని సమాచారం.

News January 29, 2026

ఏ దేవుళ్లకు ఏయే పుష్పాలు సమర్పించాలంటే?

image

విష్ణువుకు తులసి దళాలు ప్రీతికరం. మహాలక్ష్మికి తామరలు, ఎర్రని పూలు ఎంతో ఇష్టం. శివుడిని మారేడు దళాలతో పూజించాలి. సూర్యుడు, గణపతిని తెల్లజిల్లేడు పూలతో పూజిస్తే మంచి జరుగుతుంది. గాయత్రీ దేవికి మల్లె, మందార, కదంబ పుష్పాలు ఇష్టం. పూజకు వాడే పూలు తాజాగా, శుచిగా ఉండాలి. వాసన చూసినవి లేదా నేల రాలినవి వాడకూడదు. ఇలా ఇష్టమైన పూలతో దైవాన్ని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.

News January 29, 2026

‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

image

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.