News June 10, 2024
కమల్ ‘థగ్ లైఫ్’ 60 శాతం పూర్తి

మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో 37 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న థగ్ లైఫ్ మూవీ షూటింగ్ 60% పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 40 రోజుల్లో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాలో లోకనాయకుడు త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News September 13, 2025
ఇంగ్లండ్.. హయ్యెస్ట్ స్కోర్లకు కేరాఫ్ అడ్రస్!

ఫార్మాట్ ఏదైనా అత్యధిక స్కోర్లు నమోదు చేయడం ఇంగ్లండ్‌కు చాలా మామూలు విషయం అని చెప్పవచ్చు. వన్డేల్లో టాప్-3 హయ్యెస్ట్ స్కోర్లు (498/4 vs NED, 481/6 vs AUS, 444/3 vs PAK) ఆ జట్టు పేరిటే ఉంది. టెస్టుల్లో శ్రీలంక (952/6 vs IND) తర్వాత రెండో అత్యధిక స్కోర్ కూడా ENG పేరు మీదనే (903/7d vs AUS) నమోదైంది. తాజాగా అంతర్జాతీయ టీ20ల్లో ఫుల్ మెంబర్ టీమ్‌పై అత్యధిక స్కోర్ (304/2vsSA) చేసింది కూడా ఇంగ్లండే.
News September 13, 2025
మేఘాలయ మాజీ సీఎం కన్నుమూత

మేఘాలయ మాజీ సీఎం D.D. లాపాంగ్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన షిల్లాంగ్‌లోని బెథానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. లాపాంగ్ 1992 – 2010 మధ్య 4 సార్లు CMగా పని చేశారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించి తొలుత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేఘాలయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో లాపాంగ్ ఒకరిగా నిలిచారు.
News September 13, 2025
మైథాలజీ క్విజ్ – 4

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.