News April 6, 2025
విచారణకు మళ్లీ గైర్హాజరైన కమ్రా

కమెడియన్ కునాల్ కమ్రా మూడోసారీ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు. మహారాష్ట్ర Dy.CM శిండేపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సమన్లు ఇచ్చిన పోలీసులు నిన్న విచారణకు రావాలంటూ నోటీసులు పంపగా వాటికి ఆయన స్పందించలేదు. తమిళనాడులోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా అక్కడ లేకపోవడంతో వాట్సాప్‌లో సందేశం పంపించామని, కమ్రా నుంచి స్పందన లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
Similar News
News April 7, 2025
ALERT.. రేపు, ఎల్లుండి వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు 10 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు రానున్న మూడ్రోజుల తర్వాత రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వెల్లడించింది.
News April 6, 2025
కంచ భూములు కాపాడాలని విద్యార్థుల విజ్ఞప్తి

TG: గచ్చిబౌలి కంచ భూములను కాపాడాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను గచ్చిబౌలిలో కలిసి విద్యార్థి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. భూముల కోసం తాము నిరసనలు చేపట్టిన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. భూములను పరిశీలించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేలా చొరవ చూపాలని మీనాక్షికి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై మాట్లాడి చెప్తానని విద్యార్థి నేతలకు ఆమె హామీ ఇచ్చారు.
News April 6, 2025
అగ్నివీర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు

అగ్నివీర్లకు పోలీసు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ తెలిపారు. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్నివీర్లకు రాష్ట్ర నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.