News April 10, 2025
కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.
Similar News
News March 9, 2026
చిన్న సినిమా.. పెద్ద హిట్!

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో తమిళంలో <<18664403>>తెరకెక్కిన<<>> ‘తాయ్ కిళవి’ మూవీ కలెక్షన్లు కొల్లగొడుతోంది. 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹50 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 70 ఏళ్ల వడ్డీ వ్యాపారి పాత్రలో రాధిక చేసిన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. హీరో కార్తికేయన్ ఈ మూవీని నిర్మించగా, శివకుమార్ మురుగేశన్ తెరకెక్కించారు.
News March 9, 2026
‘పొండాట్టి’ థాంక్యూ.. సంజూ ఎమోషనల్ పోస్ట్!

శాంసన్ తన భార్య చారులతపై ఉన్న లవ్‌ను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. WC విజయం తర్వాత ఆయన పెట్టిన పోస్ట్ వైరలవుతోంది. ‘పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా నిలిచినందుకు థాంక్యూ పొండాట్టి (భార్య). నా మంచినీ, చెడునీ చూసి కూడా నన్ను నన్నుగా ప్రేమించి నా పక్కనే బలంగా నిలబడ్డావు. నా లైఫ్‌లో క్రికెట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకొని ఈ క్షణం కోసం నాకంటే ఇంటెన్సిటీతో కలలు కన్నావు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
News March 9, 2026
మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి

ఇజ్రాయెల్, ఇరాన్ నేతలకు PM మోదీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుందని ఇండియాలో UAE రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా అన్నారు. గల్ఫ్ నేతలే కాకుండా ప్రజలు, బిజినెస్ కమ్యూనిటీల్లోనూ మోదీపై గౌరవం ఉందని చెప్పారు. యుద్ధంలోకి దిగే ఆలోచన తమకు లేదని, UAEని లాంచింగ్ ప్యాడ్‌గా వాడుకునేందుకు అంగీకరించబోమని స్పష్టంచేశారు. ఇరాన్ తమ పొరుగు దేశమని, ఇజ్రాయెల్ మిత్రపక్షమని, రెండింటితోనూ చర్చలు జరపగలమని తెలిపారు.


