News April 16, 2025

కందుకూరి వీరేశలింగం: సంఘ సంస్కరణల సముద్రం

image

తెలుగు జాతి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి నేడు. స్త్రీ విద్య, వితంతు వివాహాలు, బాల్య వివాహ నిర్మూలన కోసం అవిశ్రాంత కృషి చేశారు. తొలి తెలుగు నవల ‘రాజశేఖర చరిత్రము’, స్వీయచరిత్ర, ప్రహసనాలు రచించారు. వివేకవర్ధని, హాస్య సంజీవిని పత్రికలు స్థాపించి సామాజిక చైతన్యం కల్పించారు. బ్రహ్మ సమాజం, హితకారిణి సంస్థలతో సమాజ సేవకు ఆస్తులనే అర్పించారు.

Similar News

News April 16, 2025

యవ్వనంలోనే కీళ్లవాపును గుర్తించడమెలా?

image

వృద్ధాప్యంలో వచ్చే కీళ్లవాపు(ఆర్థరైటిస్)ను యవ్వనంలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు నడచిన లేదా పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకునే క్రమంలో కీళ్లలో నొప్పి రావడం, ఉదయం నిద్రలేచిన అరగంటకంటే ఎక్కువసేపు కండరాలు పట్టేసినట్లు ఉండటం, కీళ్ల చుట్టూ వాపు, తరచూ నీరసం, చేతుల్లో సూదులు గుచ్చినట్లుగా అనిపించడం వంటి లక్షణాలు మున్ముందు రానున్న కీళ్లవాతానికి సూచనలని పేర్కొంటున్నారు.

News April 16, 2025

కాసేపట్లో వర్షం..

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురుస్తుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు, గం.కు40KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. VKB జిల్లాల్లో మోస్తరు వర్షాలు, గం.కు40-61KM వేగంతో గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అటు 3 రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News April 16, 2025

అనారోగ్యం భరించలేక యువకుడి ఆత్మహత్య

image

TG: మంచిర్యాల జిల్లాకు చెందిన చెల్మాటికారి అనిల్‌ను గత కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిళ్లలు, వైరల్ ఫీవర్ వేధిస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా అనారోగ్యం తగ్గలేదు. దీంతో క్షమించమంటూ తల్లిదండ్రులకు లేఖ రాసి ఇంట్లోనే ఉరేసుకుని తనువు చాలించాడు. నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. చేతికందొచ్చిన బిడ్డను కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

error: Content is protected !!