News April 4, 2024

కేన్ మామ వచ్చాడు

image

గుజరాత్‌తో మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు GT ప్లేయర్ మిల్లర్ దూరమవగా విలియమ్సన్‌కు తుది జట్టులో చోటు దక్కింది.
తుది జట్లు
GT: సాహా, గిల్, సుదర్శన్, విలియమ్సన్, విజయ్ శంకర్, ఒమర్జాయ్, తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్, నల్కండే
PBKS: ధవన్, బెయిర్‌స్టో, జితేశ్, ప్రభ్‌సిమ్రాన్, సామ్ కర్రన్, శశాంక్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, అర్ష్‌దీప్

Similar News

News October 8, 2024

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

image

TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <>వెబ్‌సైట్‌<<>>ను సందర్శించండి.

News October 8, 2024

నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?

image

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్‌ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.

News October 8, 2024

శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.