News March 5, 2025
రికార్డులు సృష్టించిన కేన్ మామ

అంతర్జాతీయ క్రికెట్లో న్యూజిలాండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు (19,000) చేసిన బ్యాటర్గా కేన్ విలియమ్సన్ రికార్డు నెలకొల్పారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్ మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో హైయెస్ట్ రన్స్(442) చేసిన NZ ఆటగాడిగా నిలిచారు. ఫ్లెమింగ్ (441)ను అధిగమించారు.
Similar News
News January 15, 2026
U19 WC: USAపై భారత్ విజయం

U19 వన్డే WCలో USAతో మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత USA 107 పరుగులకు ఆలౌటైంది. తర్వాత భారత్ ఛేజింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 37 ఓవర్లలో 96 పరుగులకు కుదించారు. IND 17.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేజ్ చేసింది. ఆయుష్ 19, వైభవ్ 2 పరుగులు చేయగా అభిజ్ఞాన్ (42) నాటౌట్గా నిలిచారు. 5 వికెట్లు తీసిన హెనిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
News January 15, 2026
మృణాల్, ధనుశ్ పెళ్లంటూ ప్రచారం!

తమిళ హీరో ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకోనున్నట్లు మరోసారి ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 14(ప్రేమికుల రోజు)న వీరిద్దరూ వివాహ జీవితంలోకి అడుగుపెడతారని దాని సారాంశం. అతికొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరు ఒక్కటి కానున్నారని తెలుస్తోంది. గతంలోనూ వీరు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగ్గా మృణాల్ ఖండించారు. అయితే తాజా ప్రచారంపై ధనుశ్, మృణాల్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
News January 15, 2026
కోకాకోలా $1B ఐపీఓ? క్లారిటీ ఇచ్చిన కంపెనీ

హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ (HCCB) IPOపై వస్తున్న వార్తలను ఆ కంపెనీ తోసిపుచ్చింది. ఈ వేసవిలో లేదా సమీప భవిష్యత్తులో అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని సంస్థ ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాము కేవలం మార్కెట్లో పట్టు సాధించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంపైనే ఫోకస్ పెట్టామన్నారు. GST వల్ల లభించిన ధరల ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నామని తెలిపారు. IPO వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు.


