News March 25, 2024
‘వేశ్య’ కామెంట్స్పై స్పందించిన కంగనా

తనను ‘వేశ్య’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనతేపై కంగన ఫైర్ అయ్యారు. ‘ఆర్టిస్ట్గా నా కెరీర్లో నేను అన్ని రకాల పాత్రలు పోషించాను. సెక్స్ వర్కర్లను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళా ఆత్మగౌరవం కోరుకుంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. కంగనాను MP అభ్యర్థిగా BJP ప్రకటించిన నేపథ్యంలో సుప్రియ ఆ పోస్టు చేశారు.
Similar News
News January 29, 2026
ఏకాదశి రోజున ఏం చేయాలంటే..?

5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో పాటు మన మనసును అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును పూజించాలి. లక్ష్మీదేవిని కొలుస్తే సిరి సంపదలు సొంతమవుతాయని నమ్మకం. కుదిరితే జాగారణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. శక్తి కొలది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా తులసి దళాలతో స్వామిని పూజించడం, నెయ్యి దీపం వెలిగించడం అత్యంత శుభకరం.
News January 29, 2026
మున్సిపల్ ఎలక్షన్స్.. తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నిన్న మొదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 902 నామినేషన్లు దాఖలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా కాంగ్రెస్ నుంచి 382, BRS 258, BJP 169, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 55 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ గడువు రేపటితో ముగియనుంది. ఉ.10.30 నుంచి సా.5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటున్నారు.
News January 29, 2026
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’: CM CBN

AP: ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేసి పర్యవేక్షించేలా చేపట్టిన ‘<<18580194>>సంజీవని<<>>’ ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేలా క్షేత్రస్థాయిలో వివిధ ప్రణాళికల్ని చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయంపై ఆరా తీశారు.


