News November 25, 2024
మహారాష్ట్రలో ఎంవీఏ ఓటమిపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్రలో మహిళలను అగౌరవపరిచినందుకే మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఓటమి పాలైందని ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే దారుణమైన పరాజయాన్ని పొందుతారని తాను ముందే ఊహించినట్లు తెలిపారు. ముంబైలోని తన నివాసాన్ని కూల్చివేసి దూషించినట్లు పేర్కొన్నారు. దేశ విచ్ఛిన్నం గురించి మాట్లాడిన వారికి మహా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని దుయ్యబట్టారు.
Similar News
News November 25, 2024
ఈరోజు ఉ.10 గంటలకు..
AP: తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను ఉ.10 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మ.3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
News November 25, 2024
మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత
TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.
News November 25, 2024
ప్చ్.. ఆర్సీబీ మళ్లీ అంతే!
RCB మేనేజ్మెంట్ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్స్ మనీ ఎక్కువగా ఉన్నా మంచి ప్లేయర్లను కొనుగోలు చేయలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్వుడ్కు రూ.12.50 కోట్లు చాలా ఎక్కువ అని.. స్టార్క్, షమీ, నటరాజన్ లాంటి బౌలర్లను కొనాల్సిందంటున్నారు. ప్రస్తుతం RCBలో సుయాశ్ శర్మ, యశ్ దయాల్, రసిక్ సలాం లాంటి సాధారణ బౌలర్లే ఉన్నారు. మరి ఇవాళ RCB ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి.