News May 19, 2024
‘కంగువా’ మూవీ రిలీజ్ డేట్ లాక్?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో కానీ నవంబర్ 1న కానీ విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. సిరుతై శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు.
Similar News
News January 7, 2026
నేటి ముఖ్యాంశాలు

* ఏపీలో మాల్దీవ్స్ తరహా ఐల్యాండ్ టూరిజమ్: CBN
* స్పెషల్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలు: APSRTC
* ‘రాయలసీమ’పై రేవంత్‌తో కలిసి CM కుట్ర: YCP
* ఐదు రోజుల పాటు సాగిన TG అసెంబ్లీ, శాసన మండలి
* ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.15,946 కోట్లు: భట్టి
* మార్చిలో అందుబాటులోకి ‘భూ భారతి’ పోర్టల్: పొంగులేటి
* KCR అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్
News January 7, 2026
బంగ్లాదేశ్‌లో మరో హిందువు.. మూక దాడి నుంచి తప్పించుకోలేక..

బంగ్లాదేశ్‌లో మరో హిందువు బలయ్యాడు. నవ్గావ్లోని మహాదేవ్‌పూర్‌లో దొంగతనం చేశాడంటూ మిథున్ సర్కార్(25)ను మూక వెంటాడింది. దీంతో తప్పించుకునే దారి లేక, ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు కాలువలోకి దూకాడు. ఈత రాక నీట మునిగి చనిపోయాడు. సాయం కోసం అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఇటీవల హిందువులపై ఇలాంటి <<18775269>>ఘటనలు<<>> జరుగుతూనే ఉన్నాయి.
News January 7, 2026
ధనవంతులైనా విచారణను ఎదుర్కోవాల్సిందే: SC

విచారణను తప్పించుకోవడానికి ధనవంతులు చట్ట నియమాలను సవాల్ చేయడాన్ని CJI తప్పుబట్టారు. ఇలాంటి వాటిని అనుమతించేది లేదన్నారు. సాధారణ పౌరుల మాదిరి వారూ కోర్టు విచారణను ఎదుర్కోవలసిందేనని స్పష్టం చేశారు. అగస్టావెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ డీల్ స్కామ్ కేసులో PMLA చట్టంలోని 44(1,c) ని సవాల్ చేస్తూ గౌతమ్ ఖేతాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. ధనవంతుడిని కాబట్టి స్పెషల్ హియరింగ్ ఇవ్వాలనడం సరికాదన్నారు.


