News November 15, 2024
కంగువా: నిన్న విడుదల.. ఇవాళ ఆన్లైన్లో..

సూర్య నటించిన ‘కంగువా’ మూవీని పైరసీ భూతం వెంటాడుతోంది. నిన్న విడుదలైన ఈ సినిమా పలు వెబ్సైట్లలో దర్శనమివ్వడం మేకర్స్ని షాకింగ్కు గురి చేస్తోంది. తమిళ్ రాకర్స్, ఫిల్మీజిల్లా, మూవీ రూల్స్, టెలిగ్రామ్ తదితర సైట్లలో కంగువా HD ప్రింట్ అందుబాటులో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టిన సినిమాను ఇలా పైరసీ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూర్య ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 15, 2025
పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణలు!

పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య ఇటీవల ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ముస్లిం దేశాల జోక్యంతో అఫ్గాన్ కాల్పులను తాత్కాలికంగా విరమించుకుంది. అయితే మళ్లీ తాలిబన్ సైన్యం, పాక్ ఆర్మీ మధ్య ఘర్షణలు ప్రారంభమైనట్లు సమాచారం. ప్రత్యర్థులు కుట్ర పన్నుతున్నారన్న ముందస్తు సమాచారంతో అఫ్గాన్ సైన్యం సరిహద్దులోని పాక్ పోస్టులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగినట్లు తెలుస్తోంది.
News October 15, 2025
2800 MW విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి

AP: రాష్ట్రంలో 2800 MW విద్యుదుత్పత్తి ప్లాంట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం GOలు జారీచేసింది. మన్యం(D) మక్కువ(M) దుగ్గేరులో 2000MW హైడ్రో ప్రాజెక్టు కోసం ‘చింతా గ్రీన్ ఎనర్జీ’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం(D) కమలపాడు, కొనకొండ్ల, గుల్లపాలెంలో ‘ACME ఊర్జా’, బెళుగుప్ప(M)లోని 4 గ్రామాల్లో ‘TATA’ 400MW చొప్పున సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఓకే చెప్పింది. వీటికి భూమి ఇతర రాయితీలను GOల్లో పొందుపర్చారు.
News October 14, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ సెమీస్ వెళ్లాలంటే?

SA, AUS చేతిలో ఓడిపోయిన టీమ్ఇండియా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నెక్ట్స్ ఈనెల 19న ENG, 23న NZ, 26న బంగ్లాతో తలపడనుంది. బంగ్లా మినహా ENG, NZపై భారత రికార్డు పేలవంగా ఉంది. కానీ వీటితో చివరగా జరిగిన సిరీస్ల్లో INDనే పైచేయి(2-1) సాధించింది. లీగ్లో మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిస్తే నేరుగా సెమీస్కు వెళ్లే అవకాశముంది. లేదంటే కనీసం 2 గెలిచి, మెరుగైన NRR మెయింటెన్ చేస్తే క్వాలిఫై అవ్వొచ్చు.