News March 19, 2025
మోహన్‌బాబుకు ‘కన్నప్ప’ టీమ్ విషెస్

మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న ఆయన ఫొటోను కుమారుడు మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇటీవల మూవీ నుంచి విడుదలైన టీజర్, పాటకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News March 19, 2025
క్రేన్ వక్కపొడి: 40KGల బంగారం, 100 KGల వెండి స్వాధీనం?

AP: గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ ఛైర్మన్ కాంతారావు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు 2 రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 కేజీల బంగారం, 100 కేజీల వెండి, రూ.18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంస్థలో భారీగా నల్లధనం చేరుతున్నట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. లావాదేవీలపై స్పష్టత కోసం కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
News March 19, 2025
రోజూ వైట్ రైస్ తింటున్నారా?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. ‘బ్రౌన్ రైస్(దంపుడు బియ్యం)లో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. అధిక ఫైబర్ ఉన్న బ్రౌన్ రైస్ ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఇది బ్లడ్‌లో షుగర్ స్థాయులను స్థిరంగా ఉంచడమే కాకుండా మెదడు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని తెలిపారు. SHARE IT
News March 19, 2025
శ్రీవారి వివిధ సేవల టికెట్ల విడుదల తేదీలివే..

AP: తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల జూన్ నెల కోటాను ఈ నెల 21న ఉ.10 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే రోజు మ.3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల మే నెల కోటా టికెట్లు రిలీజ్ అవుతాయి. అలాగే, మార్చి 22న ఉ.10 గంటలకు జూన్ నెల అంగప్రదక్షిణం టోకెన్లు, అదే రోజు ఉ.11 గంటలకు మే నెల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను TTD విడుదల చేయనుంది.