News June 7, 2024

ఈనెల 14న ‘కన్నప్ప’ టీజర్

image

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న‘కన్నప్ప’ సినిమా టీజర్ ఈనెల 14న రిలీజ్ కానుంది. కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, దీనిని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. ఈ సినిమా తన హృదయంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Similar News

News February 1, 2026

కొనసాగుతున్న గోల్డ్, సిల్వర్ రేట్ల పతనం

image

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌(MCX) <<19015375>>ఫ్యూచర్ ట్రేడింగ్‌లో<<>> బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ఏప్రిల్‌కు సంబంధించి గోల్డ్ రేటు 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.4,834 తగ్గి రూ.1,47,511కు చేరింది. ఇక కేజీ వెండి ధర(మార్చి) రూ.26,273 క్షీణించి రూ.2,65,652 పలికింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తున్నాయి.

News February 1, 2026

CM కీలక నిర్ణయం: ఫలితాల తర్వాతే ఛైర్మన్లపై ప్రకటన

image

TG: పురపాలక ఛైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థుల ఎంపికపై CM రేవంత్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే ఛైర్మన్, మేయర్ అభ్యర్థులను ప్రకటించాలని నాయకులను ఆదేశించారు. ఎన్నికలకు ముందే పేర్లు ప్రకటిస్తే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని సీఎం హెచ్చరించారు. చాలా మంది నాయకులు ఈ పదవుల కోసం డిమాండ్ చేస్తున్నారు.

News February 1, 2026

బడ్జెట్‌ ప్రసంగంలో పారదర్శకత లేదు: కాంగ్రెస్

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆర్థికమంత్రి ప్రసంగంలో పారదర్శకత లేదని, కేటాయింపులపై స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. బడ్జెట్ అంచనాలను అందుకోలేదన్నారు. ఈ బడ్జెట్ కేవలం దేశంలోని 5% మంది కోసమే రూపొందించినట్లు ఉందని సమాజ్‌వాదీ నేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.