News August 29, 2024

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కన్నయ్యనాయుడు

image

AP: విశ్రాంత ఇంజినీర్ కన్నయ్యనాయుడును ఏపీ ప్రభుత్వం సలహాదారుడిగా నియమించింది. జలవనరుల శాఖలో మెకానికల్ విభాగం సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్ అమర్చడంలో కన్నయ్యనాయుడు కీలకపాత్ర పోషించారు. నీరు వృథా కాకుండా భారీ ప్రవాహంలోనూ స్టాప్ లాగ్స్ ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్నారు.

Similar News

News November 18, 2025

4 గంటల పాటు చిన్న అప్పన్నను ప్రశ్నించిన సిట్

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A 24 చిన్ని అప్పన్నను సిట్ కస్టడీలో 4 గంటల పాటు విచారించారు. జీతం ఎంత? అకౌంట్లో కోట్లాది రూపాయల ఎలా వచ్చాయి? వైవీ సుబ్బారెడ్డితో పరిచయం, కల్తీ నెయ్యి గురించి తెలుసా, టీటీడీ టెండర్లు మార్పులపై ప్రశ్నించగా కొన్నింటికి సమాధానాలు చెప్పినట్లు సమాచారం. రాత్రికి తిరుపతి ఈస్ట్ పోలీసులకు అప్పగించారు.

News November 18, 2025

ASF: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందిన ప్రతి దరఖాస్తును పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆయన సూచించారు.

News November 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.