News October 13, 2025
కాంతార చాప్టర్-1: రిషబ్ కష్టం చూశారా?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తన కాళ్లు వాచిపోయాయని, శరీరం అలసిపోయిందంటూ ఫొటోలను రిషబ్ Xలో షేర్ చేశారు. ఈ కష్టం వల్లే క్లైమాక్స్ అభిమానులు ఆరాధించే స్థాయికి వెళ్లిందన్నారు. తాను నమ్మిన దైవశక్తి ఆశీర్వాదంతో ఇది సాధ్యమైందని తెలిపారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News October 13, 2025
ఫిట్‌నెస్‌కి సారా టిప్స్ ఇవే..

ప్రస్తుతకాలంలో వివిధ కారణాల వల్ల బరువు పెరిగేవారి సంఖ్య పెరిగింది. సారాఆలీఖాన్ కూడా మొదట్లో ఆ బాధితురాలే. ఒకప్పుడు బరువుగా ఉండే ఈమె ప్రస్తుతం ఎంతో ఫిట్‌గా మారారు. దీనికోసం ఎక్కువగా లీన్ ప్రోటీన్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకున్నానని సారా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రెగ్యులర్ యోగా, వ్యాయామం, మెడిటేషన్ చేయడం, ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు తగినంత నిద్రపోవడం కూడా తన ఆరోగ్యానికి కారణమంటున్నారామె.
News October 13, 2025
అమరావతి పనులను పరుగులు పెట్టించాలి: CBN

AP: గడువులోగా అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయాలని CM CBN అధికారులను ఆదేశించారు. పనుల్ని పరుగులు పెట్టించాలని సమీక్షలో సూచించారు. ‘పనులు ఆలస్యం లేకుండా నిర్మాణ ప్రాంతాల వద్దనే మౌలిక సదుపాయాలు కల్పించాలి. వర్షాకాలంలో ఆటంకం అయినా ఇప్పుడు స్పీడ్ పెంచండి. నిధులకు సమస్య లేదు. ఆర్థిక శాఖకు కూడా చెప్పాను’ అని వివరించారు. అమరావతికి గట్టి పునాది పడిందని, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు.
News October 13, 2025
ఉల్లి ఆధారిత ఉత్పత్తులు ఇవే..

* ఆనియర్ ఫ్లేక్స్: ఉల్లిపాయలను ముక్కలుగా కోసి వేయించడం/ఎండబెట్టడం ద్వారా ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్లేక్స్ తయారుచేస్తారు. వీటిని సూప్‌లు, కూరల్లో ఉపయోగిస్తారు.
* ఉల్లి పొడి/పేస్ట్: ఎండిన ఉల్లిపాయలను పౌడర్‌గా చేసి, వంటలు, సూప్‌లు, సాస్‌లలో వాడొచ్చు. పేస్టునూ ఉపయోగించవచ్చు.
ఉల్లి నూనె: జుట్టు సమస్యల నివారణకు ఉల్లినూనెకు డిమాండ్ ఉంది.
* ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతులకు లాభాలు చేకూర్చవచ్చు.