News October 10, 2025

రూ.509.25 కోట్లు రాబట్టిన ‘కాంతార చాప్టర్-1’

image

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా భారీ కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం మొదటి వారంలో రూ. 509.25 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ వీకెండ్ కలెక్షన్లు మరింత పెరగొచ్చని సినీవర్గాలు తెలిపాయి.

Similar News

News October 10, 2025

పెయ్య దూడకు జున్నుపాల ప్రాముఖ్యత

image

పశువు ఈనిన ఒక గంట లోపల దూడకు జున్ను పాలు తాగించాలి. ఈ సమయంలోనే జున్ను పాలలో రోగనిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్‌ను దూడ వినియోగించుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్‌ను జీర్ణించుకొనే శక్తి పెయ్యలో తగ్గుతుంది. జున్ను పాలలో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్-ఎ ఎక్కువగా ఉంటాయి. జున్ను పాలు తాగిన దూడలు 6 నెలల వయసు వరకు రోగనిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉండి త్వరగా పెరుగుతాయి.

News October 10, 2025

కత్తిలాగే మనసు కూడా.. వాడకపోతే తుప్పే: వైద్యులు

image

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక సమస్యలపై వైద్యులు అవగాహన కల్పిస్తున్నారు. ‘మనసు బాగుండాలంటే నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆహారంలో మితం పాటించాలి. వ్యాయామం చేయడం, ఫ్రెండ్స్‌తో గడపటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎప్పుడూ కొత్త విషయలను నేర్చుకోండి. వాడని కత్తి తుప్పు పడుతుంది.. మెదడు, మనసు కూడా అంతే. ఎవరికైనా మానసిక రుగ్మత రావచ్చని థెరపీ తీసుకోవడం బలహీనత కాదు’ అని వైద్యులు సూచిస్తున్నారు.

News October 10, 2025

‘అరి’ రేటింగ్&రివ్యూ

image

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల చుట్టూ తిరిగే సినిమానే ‘అరి’. మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి ఏం చేస్తారనేది డైరెక్టర్ జయశంకర్ కథతో ఆవిష్కరించారు. సాయికుమార్, వినోద్ వర్మ, అనసూయ నటన మెప్పించింది. అనూప్ మ్యూజిక్, క్లైమాక్స్ బాగుంది. స్టోరీని ఎగ్జిక్యూట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డారు. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లు వాస్తవ దూరంగా ఉండటం, కామెడీ పండకపోవడం మైనస్.
రేటింగ్- 2.5/5