News October 2, 2025
‘కాంతార ఛాప్టర్-1’ రివ్యూ&రేటింగ్

అడవిలో దైవ శక్తిగల ఈశ్వరుని పూదోట చుట్టూ తిరిగే కథే ‘కాంతార ఛాప్టర్-1’. డివోషనల్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్, VFx అదిరిపోయాయి. చివర్లో ‘చాముండి’ అవతారంలో రిషబ్ శెట్టి నటవిశ్వరూపం చూపించారు. హీరోయిన్ రుక్మిణి పాత్ర కథను మలుపు తిప్పుతుంది. పాటలు అంతగా ఆకట్టుకోవు. BGM ఫర్వాలేదు. ఫస్టాఫ్ స్లోగా సాగడం, కామెడీ పండకపోవడం మైనస్. సీక్వెల్‌గా చాప్టర్-2 ఉంటుందని ప్రకటించారు.
రేటింగ్: 3/5
Similar News
News February 12, 2026
VIRAL: ₹300తో కొని ₹634కోట్లకు అమ్మాడు!

మలేషియాకు చెందిన కింగ్ అర్స్యాన్ ఇస్మాయిల్ 1993లో కేవలం ₹300తో ‘ai.com’ అనే డొమైన్‌ను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏఐకి పెరిగిన క్రేజ్ వల్ల ఈ డొమైన్‌ను ఇస్మాయిల్ ఒక క్రిప్టో సంస్థకు ఏకంగా ₹634 కోట్లకు విక్రయించారు. కామ్ వ్యవస్థాపకుడు క్రిస్ మార్జాలెక్ ఈ డొమైన్‌ను దక్కించుకున్నారు. గతంలో దీనిని ‘OpenAI’ కూడా వాడుకుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభం పొందిన అరుదైన డీల్‌గా ఇది నిలవడం విశేషం.
News February 12, 2026
పవన్ కళ్యాణ్‌ను కలిసిన బాలకృష్ణ

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన పేషీలో కలిశారు. నియోజకవర్గ అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
News February 12, 2026
రాహుల్ సభ్యత్వం రద్దుకై BJP MP తీర్మానం

రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయాలని తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు BJP MP నిషికాంత్ దూబే తెలిపారు. ఈ మేరకు స్పీకర్‌కు ప్రతిపాదించారు. దీనిపై చర్చ జరిగి, ప్రభుత్వం ఓటింగ్ పెడితే సభ్యత్వం కోల్పోవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా ఒక అంశం/అభిప్రాయం/నిర్ణయంపై చర్చించాలని సభ్యులు సొంతంగా ప్రవేశపెట్టే తీర్మానాలను స్వతంత్ర తీర్మానం (Substansive Motion) అంటారు. దీనిపై చర్చపై స్పీకర్‌దే తుది నిర్ణయం.


