News October 6, 2025
కాంతార ఛాప్టర్-1: నాలుగు రోజుల్లో రూ.310 కోట్లు!

రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ మూవీ థియేటర్లలో భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.65 కోట్లకుపైగా కలెక్ట్ చేసిందని పేర్కొన్నాయి. అటు బుక్ మై షోలో నిన్న మధ్యాహ్నం వరకు 50 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయని మూవీ యూనిట్ పేర్కొంది.
Similar News
News October 6, 2025
తురకపాలెంలో మళ్లీ మృత్యు కలకలం!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెంలో కృష్ణవేణి అనే మహిళ హైఫీవర్‌తో గుంటూరు ఆసుపత్రిలో మరణించింది. గతంలో 30 వరుస మరణాలతో గ్రామం వార్తల్లోకి ఎక్కింది. పారిశుద్ధ్యం లేకపోవడం, నీటిలో యురేనియం అవశేషాల వల్లే ఇలా అవుతోందని తేలింది. ప్రభుత్వం వైద్య బృందాలను పంపి నివారణ చర్యలు చేపట్టింది. నెలరోజుల పాటు ఇవి ఆగడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా గతంలోలాగే మహిళ మరణించడంతో జనం కలవరపడుతున్నారు.
News October 6, 2025
పెరిగిపోతున్న డిజిటల్ గ్యాప్

డిజిటల్ విప్లవంతో ఎంతో ముందుకు వెళ్తున్న ప్రపంచంలో మహిళలు మాత్రం వెనకబడే ఉన్నారు. కంటార్, IAMAI అధ్యయనం ప్రకారం దేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న మహిళల వాటా 47%. GSMA మొబైల్ జెండర్ గ్యాప్-2025 ప్రకారం, ఫోన్లున్న ఆడవాళ్ల సంఖ్య 71 శాతమైతే దానిలో స్మార్ట్‌ఫోన్లు వాడేది 36%. మగవారి సంఖ్య ఈ విషయంలో 84% శాతంగా ఉంది. ఆత్మరక్షణ నుంచి అవకాశాల వరకు డిజిటల్ నాలెడ్జ్ ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
News October 6, 2025
భారత్ సమాధి అవుతుంది: పాక్ మంత్రి

పాక్ రక్షణ మంత్రి అసిమ్ ఖవాజా భారత్‌పై స్థాయికి మించి మాట్లాడారు. ఫ్యూచర్‌లో సైనిక దాడి జరిగితే సొంత యుద్ధ విమానాల కింద భారత్ సమాధి అవుతుందని కామెంట్ చేశారు. కాగా ఉగ్రవాదాన్ని పోషిస్తే మ్యాప్‌లో పాక్ లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రెండ్రోజుల క్రితం హెచ్చరించారు. Op సింధూర్ 1.0లో చూపిన సహనం 2.0లో ప్రదర్శించమన్నారు. ఖవాజా దీనికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఇలా ఎక్స్‌ట్రాలు మాట్లాడారు.