News October 14, 2025
బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఛావ(రూ.808Cr) ఉంది.
Similar News
News October 14, 2025
హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

బిహార్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్& సెంటర్ వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, ఇంటర్, సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్సు అర్హతతో 14 పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈనెల 24న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. 2ఫోర్‌మెన్, 1టెక్నీషియన్ పోస్టులకు NOV 4న, నర్సు, డిస్ట్రిక్ టెక్నికల్ ఆఫీసర్, తదితర పోస్టులకు NOV 14న ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది.
News October 14, 2025
WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
News October 14, 2025
ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.