News October 3, 2025
‘కాంతార ఛాప్టర్-1’ వచ్చేది ఈ OTTలోనే!

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా OTT హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. శాటిలైట్ రైట్స్‌ను ZEE నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. రుక్మిణీ వసంత్, జయరామ్, గుల్షన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
Similar News
News February 21, 2026
ఒక్క పెన్షన్ తొలగించలేదు: మంత్రి

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అర్హులందరికీ ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. గత 20 నెలల్లో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లినవారి పెన్షన్లు మాత్రమే రద్దు చేశామని వెల్లడించారు. పెన్షన్లు, రుణాలపై జగన్ నోటికొచ్చినట్లు మాట్లాడి, ప్రజల్లో భయాలు సృష్టిస్తున్నారని కొండపల్లి మండిపడ్డారు.
News February 21, 2026
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 21, 2026
మామిడి: ఈ దశలో కాయ తొలిచే పురుగు ముప్పు మొదలు

మామిడి కాయలు నిమ్మ సైజు కంటే పెద్దవయ్యే దశ నుంచి కాయ తొలిచే పురుగులు కాయల తొడిమలు, రెండు కాయలు కలసి ఉన్నచోట గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చిన పురుగులు కాయలను తొలిచి తింటూ అవి పగిలి, రాలి పోవడానికి కారణమవుతాయి. ఈ పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి క్లోరిఫైరిఫాస్(50 ఇ.సి) 1ml మరియు వేప మందు (10,000 ppm) 2ML కలిపి పిచికారీ చేయాలి. పండుఈగ కట్టడికి ఎకరాకు 8-10 మిథైల్ యూజీనాల్ ట్రాప్స్ అమర్చాలి.


