News January 8, 2025
కన్యాకుమారి టు ఖరగ్‌పూర్.. ఇస్రో కొత్త ఛైర్మన్ నేపథ్యమిదే..

ఇస్రో కొత్త <<15093696>>ఛైర్మన్<<>> వి.నారాయణన్ స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. పాఠశాల విద్యాభ్యాసమంతా తమిళ్ మీడియంలోనే చదివారు. అనంతరం IIT ఖరగ్‌పూర్‌లో ఎంటెక్ ఇన్ క్రయోజెనిక్ ఇజినీరింగ్ చేశారు. ఫస్ట్ ర్యాంకర్‌గా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు. తర్వాత IIT ఖరగ్‌పూర్‌లోనే ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్‌లో PhD పూర్తి చేశారు. ఈక్రమంలోనే రాకెట్ అండ్ స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ విభాగంలో నారాయణన్ ఆరితేరారు.
Similar News
News November 23, 2025
సాయి శత జయంతి: 14 ఏళ్లకే అవతార ప్రకటన

ఆధ్యాత్మిక సారథి, ప్రేమకు వారధి అయిన శ్రీ సత్యసాయిబాబా శత జయంతి నేడు ఘనంగా జరుగుతోంది. 14 ఏళ్ల వయసులోనే బాబాగా అవతార ప్రకటన చేసిన స్వామి, కొన్నేళ్లుగా విద్య, వైద్యం వంటి అనేక సేవలు అందించారు. ఈ నిస్వార్థ సేవలు 140 దేశాల్లో సాయి సేవాదళ్ ద్వారా విస్తరించాయి. భక్తులు లక్షలాదిగా తరలివచ్చి వేడుకల్లో పాల్గొంటున్నారు.
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.


