News October 13, 2025
‘కపాస్ కిసాన్ యాప్’.. వాడకం ఎలా?

యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నంబర్, ఓటీపీతో ఎంటర్ అవ్వాలి. తర్వాత రైతు పేరు, జెండర్, తేదీ, చిరునామా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత ఏ మార్కెట్‌లో పత్తి అమ్మాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి. అలాగే భూమి సొంతమా? కౌలుదారా? అనేది చెప్పాలి. పొలం పాస్ బుక్, పంట రకం, విస్తీర్ణం కూడా నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తేదీ, టైమ్ ప్రకారమే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లాలి.
Similar News
News October 13, 2025
ఏపీ అప్‌డేట్స్

☛ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగింపు.. న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశం
☛ రేపు, ఎల్లుండి రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో మంత్రి దుర్గేశ్ పర్యటన.. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి
☛ పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్టు సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు
News October 13, 2025
పవర్‌గ్రిడ్‌లో భారీగా ఇంజినీరింగ్ ఉద్యోగాలు

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 182 పోస్టులు, సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 39 ఖాళీలున్నాయి. గేట్-2026, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనుంది. బీటెక్, BE, BSc(Engg) ఎలక్ట్రికల్, సివిల్, CS, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. DEC 31, 2025 నాటికి అభ్యర్థుల వయసు 28 ఏళ్లలోపు ఉండాలి. FEB/MARCH 2026లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
News October 13, 2025
మేమూ వారి పద్ధతిలోనే USను గౌరవిస్తాం: చైనా

తమ ఉత్పత్తులపై US 100% అదనపు సుంకం విధించడంపై చైనా స్పందించింది. ‘పరస్పర ప్రయోజనాలకోసం అదేరకమైన టారిఫ్ వారిపైనా వేసి సమాన గౌరవం ఇస్తాం’ అని చైనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అమెరికా తీరు ఇలాగే ఉంటే తమ హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోక తప్పదని పేర్కొంది. US తప్పుడు విధానాలను మార్చుకోవాలని విదేశాంగ అధికార ప్రతినిధి సూచించారు. కాగా తాజా టారిఫ్‌తో చైనా వస్తువులపై US టారిఫ్ భారం 130%కి చేరుతుంది.