News May 16, 2024

SCBA ప్రెసిడెంట్‌గా కపిల్ సిబల్

image

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(SCBA) అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఆయనకు 1,066 ఓట్లు రాగా, మరో అడ్వొకేట్ ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు, అదిష్ అగర్వలాకు 296 ఓట్లు వచ్చాయి. ఫైనల్ ఓట్లు అధికారికంగా వెలువడాల్సి ఉంది. సిబల్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం ఇది నాలుగోసారి. 1995-96, 1997-98, 2000-01లో పనిచేశారు. ఈయన ప్రస్తుతం యూపీ నుంచి(సమాజ్‌వాదీ పార్టీ) రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

Similar News

News February 10, 2026

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. ఎన్నిక వాయిదా

image

TG: నారాయణపేట(D) మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డుకు పోటీ చేస్తున్న BJP అభ్యర్థి మహదేవప్ప మృతితో అక్కడి ఎన్నికను SEC వాయిదా చేసింది. మరో తేదీపై త్వరలో ప్రకటన చేయనుంది. కాగా రేపు పోలింగ్ జరగాల్సి ఉండగా నిన్న రాత్రి ఆయన <<19098651>>సూసైడ్<<>> చేసుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వేధింపులతోనే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

News February 10, 2026

చేపల చెరువుల్లో నీటి నాణ్యత కోసం సూచనలు

image

చేపల చెరువుల్లో పాడిల్ వీల్ ఎరేటర్లు వాడటం ద్వారా చెరువుల్లో ప్రాణ వాయువును పెంచుకోవచ్చు. పరిమితికి మించి చెరువులో చేప పిల్లలను వదలకూడదు. అలాగే చేపల సంఖ్యను బట్టి ఆహారం వేయాలి. ఎక్కువగా వేస్తే చేపలు తినగా మిగిలిన ఆహారం కుళ్లిపోయి చెరువులో ప్రాణ వాయువు పరిమాణాన్ని తగ్గిస్తుంది, అమ్మోనియా మోతాదును పెంచుతుంది. అలాగే చెరువులో పెరిగే కలుపు మొక్కలను నివారిస్తే నీటి నాణ్యత మెరుగుపడుతుంది.

News February 10, 2026

స్పీకర్‌పై అవిశ్వాసం.. మద్దతుకు టీఎంసీ నిరాకరణ?

image

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటి వరకు 100 మందికి పైగా విపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాసేపట్లో ఆ నోటీసును లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు అందజేయనున్నారు.