News March 13, 2025

జర్నలిస్టుల అరెస్ట్‌పై కపిల్ సిబల్ అసహనం.. పూనమ్ రిప్లై!

image

సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. ఇలా అరెస్టులు చేయడం పరిష్కారం కాదని, ఇది అంటువ్యాధిలాంటిదని మండిపడ్డారు. ఈ చర్యపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌కు సినీ నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ.. ‘ఆమె ఇతర మహిళలకు పరువు నష్టం కలిగించడమే అజెండాగా పనిచేస్తుంది. నేనూ ఆమె బాధితురాలినే’ అని పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

image

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.