News October 21, 2024

₹1,000 కోట్ల‌కు స‌గం వాటా అమ్మేసిన క‌ర‌ణ్‌ జోహార్‌

image

బాలీవుడ్‌లో భారీ డీల్ కుదిరింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా క‌లిగిన క‌ర‌ణ్ సంస్థను న‌డిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్ష‌న్స్ హౌస్‌లో భాగ‌స్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చుతామని క‌ర‌ణ్ పేర్కొన్నారు.

Similar News

News January 8, 2026

Official: ‘జన నాయగన్‌’ విడుదల వాయిదా

image

విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. అనివార్య కారణాలతో విడుదలను నిలిపివేస్తున్నట్లు KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అవుతూ వచ్చింది. కొన్ని సన్నివేశాలు తొలగించాలని సూచించిన సెన్సార్ బోర్డు, మార్పుల తర్వాత స్పందించలేదు. దీంతో నిర్మాణ సంస్థ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

News January 8, 2026

ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ

image

దేశంలో ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలిదశ ప్రారంభం కానుంది. ఇందులోభాగంగా ఇళ్ల లిస్టింగ్ జరుగుతుందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుందని చెప్పింది. ప్రతి రాష్ట్రానికి 30రోజుల వ్యవధి ఉంటుందని తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రెండో విడతలో జనాభా లెక్కలు సేకరించనుంది. ఇది 2027 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. ఇందుకోసం కేంద్రం ₹11,718 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది.

News January 8, 2026

ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా.. నోబెల్ ఇవ్వరా: ట్రంప్

image

తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వనందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నార్వేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒంటిచేత్తో 8 యుద్ధాలు ఆపేశా. నాటో సభ్య దేశమైన నార్వే నన్ను నోబెల్‌కు ఎంపిక చేయకుండా ఫూలిష్‌గా వ్యవహరించింది. అయినా నోబెల్ నాకు మ్యాటర్ కాదు. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడాను. అది చాలు’ అని ట్వీట్ చేశారు. అమెరికా లేకుంటే నాటోను ఎవరూ పట్టించుకోరని.. రష్యా, చైనాలు దాన్ని లెక్కచేయవని స్పష్టం చేశారు.