News September 6, 2024
అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా కరీనా కపూర్

FY24లో భారత్లో అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సినీ సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ అగ్రస్థానంలో నిలిచారు. ఆమె రూ.20 కోట్ల పన్ను కట్టగా ఆ తర్వాతి స్థానాల్లో కియారా అద్వానీ(రూ.12 కోట్లు), కత్రినా కైఫ్(రూ.11 కోట్లు) ఉన్నారు. మొత్తంగా సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ రూ.92 కోట్ల పన్ను కట్టి అగ్రస్థానంలో నిలిచారు. విజయ్(రూ.80 కోట్లు), సల్మాన్ (రూ.75 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Similar News
News December 2, 2025
3,058 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

రైల్వేలో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, Jr క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన, 18- 30 ఏళ్ల మధ్య గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. CBT, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 2, 2025
NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nsic.co.in
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


